భారతదేశం, మార్చి 2 -- SLBC Tunnel : నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తెచ్చేందుకు తొమ్మిది రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ను సమీక్షించారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పలు విభాగాల ఉన్నతాధికారులు ఉన్నారు.

అనంతరం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ప్రాణ నష్టం ఉండకుండా ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ పనుల్లో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ను 2005-06లో ప్రారంభించారన్నారు. 2014 తెలంగాణ ఏర్పడే నాటికి 32 కిలోమీటర్ల టన్నెల్‌ పనులు పూర...