భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదస్థలానికి ఆర్మీ నిపుణుల బృందం చేరుకుంది. టన్నెల్‌ బోరింగ్ మెషీన్‌ ధ్వంసమైనట్టు గుర్తించింది. ఎయిర్‌ ట్యూబ్స్ ద్వారా టన్నెల్‌లోకి ఈ బృందం చేరుకుంది. వాటర్ స్కానర్‌ పరికరంతో బురదను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్‌ ప్రయత్నాలు చేస్తోంది.

ఇద్దరు ఇంజ‌నీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు టన్నెల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, సైనిక బృందాలు లోప‌లికి వెళ్లాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ.. అధికారులతో సమీక్షలు నిర్వ‌హిస్తున్నారు. సహాయక చర్యలపై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, సైనిక బృందాలతో పాటు మంత్రి జూప‌ల్లి కృష్ణారావ...