భారతదేశం, మార్చి 7 -- ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది ఆచూకీ కోసం 14వ రోజూ అన్వేషణ కొనసాగుతుంది. ఉదయాన్నే 7.15 గంటలకు క్యాడవర్ డాగ్స్ బృందం టన్నెల్ లోకి బయలుదేరింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం 110 మందిని తీసుకొని లోకో ట్రైన్ టన్నెల్ లోకి వెళ్లింది. పర్యవేక్షణకు డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా, ఎన్‌డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్ కామాండెంట్ డా.హర్షిత్ వెళ్లారు.

బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్‌కు చెందిన క్యాడవర్ శునకాలను టన్నెల్‌ లోపలికి తీసుకెళ్లారు. 15 ఫీట్ల లోపల ఉన్నా.. మృతదేహాలను గుర్తించడం వీటి ప్రత్యేకత అని అధికారులు చెబుతున్నారు. అన్వేషణ అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు టన్నెల్ నుండి లోపలికి వెళ్లిన బృందం తిరిగి రానుంది. అక్కడి పరిస్థితులను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ బాదావత్.. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఉబికి వస్తున్న నీరు...