భారతదేశం, మార్చి 8 -- ఎస్ఎల్‌బీసీ వద్ద జరిగిన ప్రమాదం ఒక జాతీయ విపత్తు అని.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం, సహాయక చర్యల్లో ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను వినియోగిస్తున్నట్టు వివరించారు. శనివారం ఉదయం అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్‌ను సందర్శించారు. వివిధ రంగాల నుంచి పనిచేస్తున్న రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి ఉన్న పురోగతి గురించి అధికారులు మంత్రికి వివరించారు. జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా, క్యాడవర్ డాగ్ బృందం, ర్యాట్ మైనర్స్, రోబోటిక్ రంగాల నిపుణులతో ఇత్తమ్ చర్చించారు. సహాయక చర్యలు వేగంగా జరగకపోవడానికి గల కారణాలు, అడ్డంకులు, వాటిని అధిగమించడానికి చేపట్టాల్స...