భారతదేశం, ఫిబ్రవరి 28 -- ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌‌ను వేగవంతం చేశారు. ఏడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్యాస్‌ కట్టర్‌తో బోరింగ్‌ మెషీన్ శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. బురద, మట్టిని లోకో డబ్బాల్లో నింపి.. బయటకు పంపిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. భారీ మోటార్లతో టన్నెల్ నుంచి సీపేజ్ వాటర్‌ పంపింగ్ చేస్తున్నారు. గల్లంతైన కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

టీబీఎం శిథిలాలను తొలగించేందుకు రైల్వేశాఖ రంగంలోకి దిగింది. ప్రత్యేక నిపుణులతో రెండు బృందాలను నియమించింది. మొదటి బృందం గురువారమే స్థలానికి చేరుకుంది. డివిజినల్‌ మెకానికల్‌ ఇంజినీరు ఎస్‌.మురళి నేతృత్వంలో.. సికింద్రాబాద్, లాలాగూడ, రాయనపాడు వర్క్‌షాప్‌ల నుంచి ఒక సెక్షన్‌ ఇంజినీర్, 13 మంది వెల్డర్లు, ఇద్దరు టెక్నీషియన్లు ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో స...