భారతదేశం, మార్చి 14 -- ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో 21వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే.. పలు సాంకేతిక సమస్యలతో రోబో రెస్క్యూ ఆగిపోయింది. చివరి 50 మీటర్ల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న సిబ్బంది చెబుతున్నారు. మృతదేహాల గుర్తింపు కోసం మరోసారి కాడవర్ డాగ్స్‌ను రంగంలోకి దింపనున్నారు. అటు టీబీఎం శిథిలాల కట్టింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది.

అన్వీ రోబోటిక్స్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను ప్రమాద స్థలానికి తీసుకువచ్చారు. రోబో ద్వారా టన్నెల్ లోపల ఉన్న శిథిలాలను తొలగించడం, భూమిని తవ్వడం వంటి సహాయక చర్యలు చేపట్టారు. ఈ రోబో గంటకు 5000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించగలదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు రోబోను పరిశీలించిన అనంతరం.. అటానమస్ హైడ్రాలిక్...