భారతదేశం, మార్చి 10 -- SLBC Deadbody: శ్రీశైలం లెఫ్ట్‌ బ్రాంచ్‌ కెనాల్‌ సొరంగంలో 16 రోజుల తర్వాత ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి 12 అడుగుల లోతున గడ్డకట్టిన ఒండ్రు మట్టిలో కూరుకుపోయిన మృతదేహాన్ని అతి కష్టమ్మీద బయటకు తీశారు. మిగిలిన కార్మికుల కోసం గాలింపు కొనసాగుతోంది.

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్ బీసీ) సొరంగంలో చిక్కుకున్నవారిలో ఒకరి ఆచూకీ లభించింది.ఫిబ్రవరి 22న ఎస్ ఎల్ బీసీ సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకు పోయారు. సొరంగ నిర్మాణం చేపడుతున్న టన్నెల్ బోరింగ్ మెషిన్‌ పై భాగంలోకి భారీగా నీరు, బురద పొంగి దూసుకు రావడంతో పనుల్లో ఉన్న కార్మికులు చిక్కుకుపోయారు. గల్లంతైన కార్మికుల కోసం 16 రోజులుగా సహాయచర్యలు కొనసా గిస్తున్నారు.

శనివారం రాత్రి షిఫ్టులో గాలింపు కోసం వెళ్లిన సహాయ బృందాలు టీబీఎం మెషిన్‌కు ఎడమవైపు భాగ...