Hyderabad, ఫిబ్రవరి 15 -- ప్రేమను రకరకాల పద్ధతిలో వ్యక్తపరచడానికి, ప్రేమను గెలవడానికి జరుపుకునే వాలెంటైన్ వీక్ అందరికీ తెలుసు. కానీ, ప్రేమ వ్యతిరేకులు జరుపుకునే యాంటీ వాలంటైన్ వీక్ గురించి మీకు తెలుసా? యువతకు వాలెంటైన్ వీక్ ఎంత ముఖ్యమో.. యాంటీ వాలెంటైన్ వీక్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రేమలో గెలవాలనేం లేదు కదా. అలా ప్రేమలో ఓడిపోయిన వారు జరుపుకునేదే ఈ యాంటీ వాలెంటైన్ వీక్.

ఫిబ్రవరి 14న జరిగే వాలెంటైన్ డే తర్వాత ఫిబ్రవరి 15 నుంచి యాంటీ వాలెంటైన్ వీక్ మొదలవుతుంది. స్లాప్ డే, కిక్ డే, పెర్ఫ్యూమ్ డే, ఫ్లర్ట్ డే, కన్ఫెష్షన్ డే, మిస్సింగ్ డే అంటూ వారం రోజుల పాటు అంటే ఫిబ్రవరి 21వ తేదీ వరకూ దీనిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ప్రేమలో మోసపోయిన వారు, ప్రేమ బంధంలో ఇబ్బంది పడుతున్న వారు, రిలేషన్‌షిప్ మీద నమ్మకం కోల్పోయిన వారు జరుపుకునేద...