భారతదేశం, జనవరి 27 -- స్కోడా ఇండియా తన పాపులర్ మోడల్ 'కుషాక్' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఈ అప్‌డేట్‌లో భాగంగా ఎస్​యూవీ వేరియంట్ల సంఖ్యను పెంచడమే కాకుండా, ఎంట్రీ లెవల్ వేరియంట్ కస్టమర్లకు భారీ విలువను చేకూర్చింది. ముఖ్యంగా దీని బేస్ వేరియంట్ 'క్లాసిక్ ప్లస్'ని.. తక్కువ ధరలో కూడా అన్ని ముఖ్యమైన ఫీచర్లను అందించడమే లక్ష్యంగా తయారు చేశారు. ఈ నేపథ్యంలో స్కోడా కుషాక్​ బేస్​ వేరియంట్​ ఫీచర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1. ఇంజిన్, గేర్‌బాక్స్: ఆటోమేటిక్ కూడా అందుబాటులో..

కుషాక్ క్లాసిక్ ప్లస్ వేరియంట్ కేవలం 1.0 లీటర్ టీఎస్‌ఐ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇది 113 బీహెచ్​పీ పవర్, 178 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇక్కడ ప్రధాన ఆకర్షణ గేర్‌బాక్స్ ఆప్షన్లు! కస్టమర్లు ఇందులో 6-స్పీడ్ మాన్యువల...