భారతదేశం, ఫిబ్రవరి 11 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసి స్కోడా ఇండియా కూడా తన ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెప్టెంబర్ 2025 నాటికి భారతీయ రోడ్లపైకి తీసుకువస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే.. అది ఎన్యాక్ iV అవుతుందా లేదా ఎల్రోక్ అవుతుందా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.

భారతదేశంలో స్కోడా మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం ఎన్యాక్ ఐవీ అని గతంలో వార్తలు వచ్చాయి. 2024లో వస్తుందని కూడా కొన్నిసార్లు ప్రచారం జరిగింది. అయితే ఇది ఆలస్యమైంది. ఇప్పుడు కంపెనీ జాబితాలో ఎల్రోక్, ఎన్యాక్ కూపేలను కూడా చేర్చింది. స్కోడా ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ జానెబా ప్రకారం మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెప్టెంబర్ 2025 నాటికి విడుదల అవుతుంది. కానీ అది ఎన్యాక్ ఐవీ అవుతుందా లేదా ఎల్రోక్ అవుతుంద...