Hyderabad, మార్చి 8 -- మనలో చాలా మందికి ఇదే అలవాటు ఉండొచ్చు. రాత్రి డిన్నర్ ఎక్కువగా తినేశామని ఉదయాన్నే తినడం మానేయడం ఎక్కువసార్లు చూస్తుంటాం కూడా. ముఖ్యంగా ఉద్యోగుల్లో ఈ అలవాటు కనిపిస్తుంటుంది. నిజంగానే బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే సెట్ అయిపోతుందా.. ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు? వారిచ్చే బెస్ట్ సలహా ఏంటని అడిగితే..

"రాత్రి డిన్నర్ లో ఎక్కువగా తినేసిన వారు బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం అనేది కచ్చితంగా మంచి విషయమే. దీని వల్ల మీ జీర్ణ వ్యవస్థ కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అంతేకాకుండా తిండి మానేయడం వల్ల శరీరంలోని చాలా అవయవాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థ మరంత చక్కగా పని చేస్తుంది. ఇంకా చెప్పాలంటే, మెదడు పనితీరు మెరుగవుతుంది. శరీరంలోని ఇతర అవయవాలు తమను తాము రిపేర్ చేసుకోవడానికి సరైన సమయం దొరుకుతుంది. రాత్రుళ్లు లైట్ గా తినడ...