Hyderabad, ఫిబ్రవరి 26 -- మందార పువ్వుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం సహజంగానే మృదువుగా మారి కాంతివంతంగా అవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పూలతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. బయట దొరికే రసాయనాలు కలిపిన ఫేస్ ప్యాక్ తో పోలిస్తే ఇవి సహజమైన మెరుపును ఇస్తాయి. ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి.

చర్మ సమస్యలను తొలగించుకోవడానికి బయట దొరికే ఉత్పత్తులను వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. ఇవి సహజంగా ఉంటాయి కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్టులను చూపించవు. అలాంటి ఫేస్ ప్యాక్‌లలో మందార పువ్వు ఫేస్ ప్యాక్ ఒకటి. మందార పువ్వులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఇంట్లోనే ఒక మొక్క వేసుకుంటే ఎన్నో పువ్వులు కూడా పూస్తాయి. మందార పువ్వులో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువ.

మందార పువ్వులను సేకరించి ఎండబెట్టి పొడిలా చే...