Hyderabad, ఫిబ్రవరి 13 -- అందం గురించి బ్యూటీ ఇండస్ట్రీలో తయారవుతున్న ఉత్పత్తులు కోకొల్లలు. చర్మం, అందం పరిరక్షణ కోసం లేటెస్ట్‌గా చాలా మంది నుంచి వినిపిస్తున్న టెక్నిక్ సీరం వాడకం. సీరం వాడి చర్మాన్ని రిపేర్ చేసుకోవడమే కాదు, యవ్వనవంతంగా కూడా మార్చుకోవచ్చట. ఇందులో మరో అనుమానం ఉంది. రెటినాల్ Vs విటమిన్ సీ సీరంలలో ఏది వాడితే బెటర్ అని? మీరు అదే సందేహంలో ఉంటే, ఇది మీ కోసమే.

రెటినాల్ సీరంలో విటమిన్ ఏ ఉండి చర్మానికి అందం తెప్పించడంలో సహాయపడుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మంపై కలిగే ముడతలు, హైపర్ పిగ్మంటేషన్, మొటిమలు, మచ్చలు, గీతలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. మృత కణాలను తొలగించి, ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది.

గీతలు, ముడతలు తగ్గించే రెటినాల్ తగ్గిస్తుంది: రెటినాల్ సీరం యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మ నిర...