Hyderabad, ఫిబ్రవరి 20 -- భారతీయుల్లో అనేక చర్మ రంగులు కలవారు ఉంటారు. కొంతమంది తెల్లటి చర్మాన్ని కలిగి ఉంటే, మరికొందరు గోధుమ రంగులో ఉంటారు. ఇంకొందరు చామన ఛాయగా, మరికొందరు నల్లటి చర్మం కలిగి ఉంటారు. చర్మం రంగును బట్టి మీరు వేసుకునే దుస్తుల రంగు ఆధారపడి ఉంటుంది.

మీ చర్మానికి తగ్గట్టు దుస్తులు రంగులను ఎంపిక చేసుకుంటే మీరు ఎంతో ఆకర్షణగా కనిపిస్తారు. అయితే తమ చర్మ రంగుకు తగ్గట్టు ఏ కలర్ దుస్తులు వేసుకోవాలో ఎంతో మందికి తెలియదు. మీరు తక్కువ రంగు చర్మాన్ని కలిగి ఉంటే మిమ్మల్ని మరింత అందంగా చూపించే రంగుల దుస్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

నల్లటి చర్మం ఉన్నవారు ఏ రంగులను ప్రయత్నించాలో ఇక్కడ ఇచ్చాము. ఈ రంగుల దుస్తులు వేసుకుంటే మీరు ఎంతో ఆకర్షణగా కనిపిస్తారు. ఈ రంగులన్నీ కూడా ఎంతో అందంగా కనిపించేవే.

మీ చర్మం నల్లగా ఉంటే, ముదురు నీలి రంగు లేదా డీప్ బ...