Hyderabad, మార్చి 5 -- చిత్రా పురుషోత్తం... ఈ పేరు మనకు కొత్త. కానీ కర్ణాటకలో ఎంతోమందికి తెలిసిన వ్యక్తి ఈమె. చిత్రా అందమైన బాడీ బిల్డర్. కండలు తిరిగిన శరీరం,సిక్స్ ప్యాక్ ఫిట్ నెస్ మగవారికే కాదు ఆడవారికీ సాధ్యమేనని నిరూపించింది. అద్భుతమైన శరీరాకృతితో బల ప్రదర్శనను చేసింది.

పెళ్లి దుస్తుల్లోనే ఆమె బాడీ బిల్డర్ గా చేసిన ఫోటోషూట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఫిట్‌నెస్ బాడీ బిల్డింగ్ ఈ రెండింటికీ చిత్ర చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది. అలాగే సాంస్కృతిక మూలాలను కూడా మరిచిపోదు. కంచి పట్టు చీరలో, ఒంటి నిండా బంగారంతో తనకి ఇష్టమైన బాడీబిల్డింగ్ లుక్‌తోనే ఫోటోషూట్ నిర్వహించుకుంది. ఇప్పుడు ఆ ఫోటోలు ఇంటర్నెట్లో సంచలనంగా మారాయి.

తన పెళ్లి రోజున చిత్ర పసుపు, నీలం రంగు కాంచీవరం చీరను ధరించింది. ఒంపులు తిరిగిన తన కండలను ప్రదర్శించేలా ఆ చీరను కట్టుకుంది ఆమె టోన...