భారతదేశం, ఏప్రిల్ 6 -- Sitaramula Kalyanam : దక్షిణ అయోధ్యగా కొలుచుకునే భద్రాద్రిలో సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేలాది మంది భక్తుల రామ నామ స్మరణతో భద్రగిరి మార్మోగింది. భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన త్రేతా యుగ పురుషుడు రాముడి కల్యాణం సీతా మాతతో భద్రాచల రామాలయ వేదికగా ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవానికి రాష్ట్రం నలు మూలాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఉదయం 9 గంటల నుంచి కల్యాణ క్రతువు ప్రారంభం కాగా 10 గంటల సమయానికి సీతారామ చంద్రుల ఉత్సవ విగ్రహాలను మిథిలా కళ్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది.

కల్యాణానికి మూడు నెలల ముందే గోటితో ఒలిచిన తలంబ్రాలను దేవాలయ నిర్వాహకులు సిద్ధం చేశారు. సీతమ్మక...