భారతదేశం, ఫిబ్రవరి 5 -- SIT On Liquor Irregularities : వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలు జరిగాయని కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో తీవ్ర ఆరోపణలు చేశాయి. తాము అధికారంలోకి వస్తే మద్యంపై జే ట్యాక్ విచారణ చేస్తామని స్పష్టం చేశాయి. తాజాగా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై విచారణ జరపాలని నిర్ణయించింది. 2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సిట్‌ను ప్రభుత్వం నియమించింది. మద్యం అమ్మకాలకు సంబంధించి అవరమైన పూర్తి వివరాలు సిట్ అధికారులకు ఇవ్వాలని ఎక్సైజ్‌ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిట్ బృందం సీఐడీ చీఫ్‌ ద్వారా ప్రతి 15రోజులకోసారి తమకు నివే...