భారతదేశం, మార్చి 26 -- Siricilla Suicide: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే నేత కార్మికుడు పర్కిపల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్ రూమ్ క్లీన్ చేసే యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించగా స్థానికులు సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు రాజుకు భార్య పద్మ, కొడుకు రాకేష్, కూతుర్లు మౌనిక, ప్రియాంక ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు.

యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న నేతన్న రాజుకు ఆరు లక్షల రూపాయల అప్పు ఉంది.‌ ఆ అప్పు కూడా ఇద్దరు బిడ్డలు, కొడుకు ముగ్గురి పెళ్ళీలు చేయడంతోనే అప్పు అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొద్దిరోజులుగా చేతినిండా నేత పని లేకపోవడంతో సరైన ఉపా...