భారతదేశం, ఏప్రిల్ 9 -- Siricilla Crime: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. భూవివాదం నేపథ్యంలో ముగ్గురు పై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. భార్య భర్తతో పాటు మూడేళ్ల బాలుడు కత్తిపొట్లకు గురయ్యారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు.

సిరిసిల్ల లోని శాంతినగర్ కు చెందిన కళికోట వెంకటేష్ కు సోదరుడితో గత కొంత కాలంగా భూ వివాదం ఉంది. భూ వివాదం నేపథ్యంలో వెంకటేష్ పై అతని భార్య ఏంజెల్, కొడుకు శివనేత్ర (3) ముగ్గురిపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. విశిక్షణా రహితంగా కత్తులతో దాడి చేయడంతో వెంకటేష్ భార్య కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. కత్తితో

మూడేళ్ళ బాలుడు శివనేత్రను పొడవడంతో ప్రేగులు బయటకి వచ్చాయి. తీవ్ర గాయాలపాలైన వెంకటేష్ ద్విచక్ర వాహనంపై బాబును ఆసుపత్రికి తరలించారు. శివనేత్ర పరిస్థితి విషమంగా ...