భారతదేశం, ఫిబ్రవరి 26 -- Siricilla Collector: సిరిసిల్ల కలెక్టర్ తీరు మార్చుకుని అధికారులు సక్రమంగా పని చేయకుంటే ఆందోళన చేపట్టక తప్పదని బీఆర్‌ఎస్‌ నేతలు హెచ్చరించారు. సిరిసిల్లలో ఇటీవల జరిగిన వరుస ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తోపాటు ఆ పార్టీ నేతలు కన్నెర్ర జేశారు.

కేటిఆర్ పక్షాన శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కల్వకుంట్ల సంజయ్ లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి కలెక్టర్ అధికార దర్పంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పిర్యాదు చేశారు.

అధికారం దుర్వినియోగం చేసి ప్రజల్ని భయపెడుతున్న సిరిసిల్ల కలెక్టర్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రేడ్ లైసెన్స్ ను బూచిగా చూపెట్టి కేటిఆర్ ఫోటో ఉన్న కేటిఆర్ టీ స్టాల్ ను కలెక్టర్ మూసివేయడమే కాకుండా ఆవేదనతో ఆందోళనకు దిగిన ఏడుగురు పై ...