భారతదేశం, మార్చి 9 -- Sircilla Govt Schools : చూడడానికి సర్కారు బడులు కానీ వాటిలో కార్పొరేట్ స్థాయి వసతులు అందిస్తూ ఆంగ్ల మాధ్యమం ద్వారా గుణాత్మక విద్యను అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా.. పోటీ పరీక్షల్లో రాణించేలా ప్రత్యేక ప్రణాళిక ప్రకారం శిక్షణ ఇస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చొరవతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) ల్లోని విద్యార్థులకు ఉత్తమ బోధనా తరగతుల ప్రక్రియ సాగిస్తూ విద్యార్థులకు భవితకు బంగారు బాటలు వేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రభుత్వ విద్యా సంస్థలు, దవాఖానాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో తరచూ తనిఖీలు చేస్తూ పాఠ్యాంశాల బోధన, వసతులు తదితర అంశా...