భారతదేశం, ఏప్రిల్ 5 -- Sircilla Gold Saree : సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అద్భుతాన్ని ఆవిష్కరించారు. భద్రాద్రి సీతారాముల కల్యాణానికి మగ్గంపై బంగారు పట్టు చీర నేశారు. వన్ గ్రామ్ గోల్డ్ తో సీతమ్మకు పట్టుచీర, రామయ్యకు పట్టు పంచె కండువా తయారు చేసి చేనేత కళా నైపుణ్యాన్ని చాటి చెప్పారు.

శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమయ్యింది. కల్యాణ వైభోగాన్ని కన్నుల పండువలా నిర్వహించే పనిలో భక్తులు నిమగ్నంకాగా, సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మగ్గంపై వన్ గ్రామ్ గోల్డ్ తో సీతమ్మకు బంగారు పట్టుచీర, రాముల వారికి పట్టు పంచే, కండవా నేశారు. చీర కొంగులో భద్రాద్రి ఆలయ మూల విరాట్ దేవతా మూర్తులు వచ్చే విధంగా, చీర కింది బార్డర్ లో శంఖు, చక్ర నామాలు హనుమంతుడు , గరుత్మంతుడు వచ్చే విధంగా పొందుపరిచాడు.

ఇక చీర మొత్తం శ్రీర...