భారతదేశం, మార్చి 16 -- ఎన్టీఆర్, కోట్ల, నీలం, కాసు పేర్లను తొలగించే దమ్ముందా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. దమ్ముంటే సీఎం రేవంత్ తన సవాల్‌పై స్పదించాలని డిమాండ్ చేశారు. పొట్టి శ్రీరాములు చేసిన తప్పేందని నిలదీశారు. ఆయన దేశ భక్తుడు, స్వాతంత్ర్యం కోసం అనేకసార్లు జైలుకు పోయినోడు అని గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బండి సంజయ్.. ఈ వ్యాఖ్యలు చేశారు.

'పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు. దేశ స్వాతంత్ర్యం కోసం అనేకసార్లు జైలుకు పోయినోడు. హరిజనులను ఆలయాల్లోకి ప్రవేశం కల్పించాలని ఉద్యమించి శాసనం చేయించినోడు. శ్రీరాములు లాంటోళ్లు 10 మంది ఉంటే ఎప్పుడో స్వాతంత్ర్యం తెచ్చేటోడినని అన్నారంటే ఆయన గొప్పతనం అర్ధం చేసుకోవాలి. అట్లాంటి నేత పేరును తొలగించి అవమానిస్తారా? ఆంధ్రా మూలాలున్నాయని పొట్టి శ్రీరామల...