Hyderabad, జనవరి 30 -- Siraj Dating: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ డేటింగ్ వార్తలు మరోసారి ఉత్తవే అని తేలిపోయాయి. బిగ్ బాస్ 13 ఫైనలిస్ట్ అయిన మహిరా శర్మతో అతడు డేటింగ్ చేస్తున్నట్లు బుధవారం (జనవరి 29) వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే మహిరా తల్లి సానియా శర్మ టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందించారు. ఆ వార్తల్లో అసలు ఏమాత్రం నిజం లేదని ఆమె కొట్టిపారేయడం గమనార్హం.

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఈ మధ్య తరచూ డేటింగ్ పుకార్లతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలుసు కదా. మొదట లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జానాయ్ భోస్లేతో అతడు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రాగా.. తమది అన్నాచెల్లెళ్ల బంధమని వాళ్లు స్పష్టం చేశారు.

ఆ తర్వాత బిగ్ బాస్ 13 ఫైనలిస్ట్ మహిరా శర్మతో అతడు డేటింగ్ చేస్తున్నాడని, అది కన్ఫమ్ అని టైమ్స్ ఆఫ్ ఇండియా ర...