భారతదేశం, ఫిబ్రవరి 20 -- మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) ఒక సులభమైన మార్గం. ఇటీవలి కాలంలో సిప్‌లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా యువతలో ఇది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చనే నమ్మకం వారిలో ఉంది. సిప్‌లో స్పెషాలిటీ ఏంటంటే.. చిన్న పెట్టుబడితో కూడా దీనిని ప్రారంభించవచ్చు. ఇది క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టే అలవాటును అభివృద్ధి చేస్తుంది.

సిప్‌లో ఆర్థిక పరిస్థితిని బట్టి ఎప్పుడైనా తమ పెట్టుబడి మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. పెట్టుబడి మొత్తం సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతా నుండి ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది. చిన్న పెట్టుబడితో సిప్‌ని ప్రారంభిస్తే.. పెద్దగా సమస్య ఉండదు. పదవీ విరమణ వయస్సు చేరుకున్నప్పుడు ఆర్థిక అవసరాలను సులభంగా తీర్చగల పెట్టుబడి ఆప్షన్...