భారతదేశం, ఫిబ్రవరి 2 -- సిప్ అనేది మ్యూచువల్ ఫండ్స్ అందించే పెట్టుబడి పద్ధతి. ఇది ఏకమొత్తంలో కాకుండా నిర్ణీత మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంటే నెలకు కొంత చొప్పున ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్థిరమైన పెట్టుబడులపై మీరు అధిక వడ్డీ రేట్లు కూడా పొందుతారు. క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వలన మీరు మంచి ఆదాయాన్ని చూస్తారు. ఇది మీ ఆర్థిక లక్ష్యాలకు సాయపడుతుంది.

ఉద్యోగులు, వ్యాపారులు వంటి ప్రతి వ్యక్తి తమ రిటైర్మెంట్‌ కోసం ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మిగతా లైఫ్ హ్యాపీగా ఉండవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు. సిప్‌లో అధిక మెుత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు తక్కువ పెట్టుబడితోనూ అధిక రాబడులు చూడవచ్చు. ఆందోళన లేకుండా పదవీ విరమణ తర్వాత ఎంజాయ్ చేయవచ్చు. మీరు ఈ సిప్‌లలో నెలవారీ 1,500 పెట్టుబడి పెడి...