భారతదేశం, ఏప్రిల్ 11 -- SIP in mutual fund: మ్యూచువల్ ఫండ్ ను ఎంచుకోవడానికి సరైన ప్రణాళిక, లోతైన అధ్యయనం, గత రాబడుల డేటా విశ్లేషణ అవసరం. ఆశించిన రాబడిని ఇవ్వని ఫండ్స్ కూడా చాలా ఉంటాయి. అదే సమయంలో అద్భుతమైన రాబడులను అందించిన ఎంఎఫ్ లు కూడా ఉన్నాయి. అలాటి వాటిలో ఒకటి క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ గ్రోత్ ఫండ్. ఇది గత 25 ఏళ్లలో మంచి రాబడిని ఇచ్చింది.

ఒక ఇన్వెస్టర్ మూడేళ్ల క్రితం నుంచి ఈ మ్యూచువల్ ఫండ్ లో సిప్ (SIP systematic investment plan) ద్వారా ప్రతి నెలా రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, అతడు చేసిన పెట్టుబడి మొత్తం రూ. 3.6 లక్షలు అయ్యేది. కానీ, ఆ ఫండ్ లో అతడి ఇన్వెస్ట్ మెంట్ విలువ రూ. రూ.4.24 లక్షలకు పెరిగి ఉండేది. ఇది 11.10 శాతం వృద్ధిని సూచిస్తుంది.

ఐదేళ్ల క్రితం నుంచి అతడు ఈ ఫండ్ లో సిప్ ద్వారా రూ.6 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే, అతడి ...