Hyderabad, ఫిబ్రవరి 1 -- సైనస్ సమస్యతో బాధపడేవాళ్లు బయట తిరగడానికి, ప్రశాంతంగా మాట్లాడటానికి ఇలా ప్రతిదానికి భయపడుతుంటారు. దీని నుంచి బయటపడేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మెడిసిన్ తో కొన్నిసార్లు పరిష్కారం వెదుక్కోవచ్చు. కానీ, ఒకవేళ మెడిసిన్ అందుబాటులో లేకపోయినా సైనస్ నుంచి రిలీఫ్ దక్కించుకోవాలంటే, మసాజ్ చేసుకోవడం ఒక్కటే సొల్యూషన్. ఈ సమస్య వల్ల తీవ్రమైన నొప్పి కూడా అనుభవించవచ్చు. ఈ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మసాజ్ చేయండి. ముక్కు మూసుకుని శ్వాస తీసుకోవడం కష్టమైన వాళ్లు ఈ టెక్నిక్స్ పాటించాలి. ఫలితంగా సైనస్ వల్ల కలిగే చిరాకు తగ్గిపోతుంది.

ఈ మసాజ్‌లో కొన్ని ప్రత్యేక పాయింట్లపై మసాజ్ చేయాల్సి ఉంటుంది. సైనస్ లు ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. వీటి నుంచి ఉపశమనం కోసం కొన్ని ప్రత్యేకమైన పాయింట్లపై మసాజ్ చేసినప్పుడు నొప్పి, క్లోమం నుండి ఉ...