Hyderabad, మార్చి 21 -- వంటగదిలోని ముఖ్యమైన వస్తువుల్లో సింక్ ప్రధానమైనది. వంట చేసేటప్పుడు ఆహారపదార్థాలను కడగటం నుంచీ వంట సామాగ్రిని శుభ్రం చేయడం వరకూ, తినేసిన, తాగేసిన పాత్రలను శుభ్రం చేయడం నుంచి చేతులను శుభ్రం చేసుకోవడం వరకూ అన్నింటికీ సింక్ కావాల్సిందే. ముఖ్యంగా ప్రస్తుతం వంటతో పాటు ఆఫీసులకు వెళ్లే వారికి వంటపని త్వరగా అవడం కోసం సింక్ చాలా అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే వంటగదిలో సింక్ లేనదే వంట చేసేవారికి చెయ్యి విరిగినట్టే అవుతుంది.

కానీ ఎంత జాగ్రత్తగా ఉన్న సింక్ నాళాలు తరచూ మూసుకుపోతుంటాయి. ఇందులో నుంచి చాలా సార్లు బొద్దంకలు వంటి క్రీములు బయటకు వస్తుంటాయి. అలాగే ఆహారపు పదార్థాల కారణంగా సింక్ నుంచి దుర్వాసన వస్తుంటుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంటే వెంటనే జాగ్రత్త పడండి. కిచెన్‌లో ఉండే సింక్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. ఎం...