భారతదేశం, జనవరి 28 -- Singur Tourism: సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ మండలం లోని సింగూర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సోమవారం సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో కలిసి మంత్రి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.

సింగూర్ ప్రాజెక్టులో 50 సీట్ల కెపాసిటీ తో నడిచే రెండు అధునాతన సౌకర్యాలతో కూడిన బోట్లు ,స్పీడ్ బోట్లను ఏర్పాటు చేయాలని మంత్రి పర్యాటక, నీటిపారుదల శాఖల అధికారులను ఆదేశించారు.

సింగూర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్, రోడ్ మ్యాప్ లను రూపొందించాలని మంత్రి టూరిజం, ఇరిగేషన్, ఆర్ అండ్ బి శాఖల అధికారులను ఆదేశించారు. సింగూర...