భారతదేశం, ఫిబ్రవరి 25 -- స‌ర్కారు నౌక‌రి మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సింగ‌ర్ సునీత కొడుకు ఆకాష్‌. మెసేజ్ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీలో ఆకాష్ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. స‌ర్కారు నౌక‌రి త‌ర్వాత రొమాంటిక్ ల‌వ్‌స్టోరీతో సెకండ్ మూవీ చేస్తోన్నాడు ఆకాష్‌. తథాస్తు క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఈ ల‌వ్‌స్టోరీలో ఆకాష్‌కు జోడీగా భైర‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌థానాయిక‌గా భైర‌వి కూడా ఈ మూవీతోనే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అరంగేట్రం చేస్తుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రూపొందుతోంది. రొమాన్స్‌, ల‌వ్‌తో పాటు సస్పెన్స్ కామెడీ అంశాల క‌ల‌బోత‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ఆకాష్ పాత్ర డిఫ‌రెంట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమాలో ఆకాష్ మ‌ర‌ద‌లిగా భైర‌వి క‌నిపించ‌బో...