భారతదేశం, ఫిబ్రవరి 15 -- Singer Mangli : తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని సింగర్ మంగ్లి తెలిపారు. ఈ మేరకు ఆమె బహిరంగ ప్రకటన చేశారు. "నన్ను నా పాటను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు. మీ రుణం మంగ్లీ ఎప్పటికీ తీర్చుకోలేనిది. గత వారం రోజులుగా నా పై జరుగుతున్న విష ప్రచారాన్ని చెప్పుకునేందుకు ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు వచ్చాను" అని సింగర్ మంగ్లి అన్నారు.

"శ్రీకాకుళంలో ప్రతి ఏటా జరిగే ఆధ్యాత్మిక వేడుకైన అరసవల్లి రథసప్తమి వేడుకల్లో లైవ్ ప్రోగ్రామ్ కు నన్ను ఆహ్వానించినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మ్యూజికల్ ఈవెంట్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. శ్రీకాకుళం ప్రజలు నాపై చూపిన అభిమానం ఈ జన్మలో మరువలేనిది. మరో జన్మంటూ ఉంటే ఈ సిక్కోలు గడ్డపై పుడతానని వేదికపైనే నా కృతజ్ఞత తెలుపుకున్నాను. ఈ ప్రోగ్రామ...