భారతదేశం, మార్చి 4 -- Singer Kalpana : ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. సింగర్ కల్పన హైదరాబాద్ లోని నిజాంపేట వర్టెక్స్ ప్రీ వీలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. గత రెండు రోజులుగా ఇంటి గేట్లు తెరుచుకోకపోవడంతో అనుమానంతో సెక్యూరిటీ గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్‌కు సమాచారం అందించారు. అసోసియేషన్‌ సభ్యులు ఆమెతో మాట్లాడేందుకు కాల్ చేయగా స్పందించలేదు.

దీంతో అసోసియేషన్ సభ్యులు కల్పన భర్తకు కాల్‌ చేసి విషయం తెలిపారు. ఆయన కూడా కల్పనతో మాట్లాడేందుకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అసోసియేషన్ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఇంటికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు తలుపులు పగులకొట్టి ఇంట్లోకి వెళ్లారు. ఇం...