భారతదేశం, మార్చి 5 -- Singer Kalpana : ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారని వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని కల్పన కుమార్తె దయ ఖండించారు. సింగర్ కల్పన (Singer Kalpana) ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె దయ బుధవారం మీడియాతో మాట్లాడారు. తన తల్లి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. తన తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదని స్పష్టత ఇచ్చారు. ఆమె ఇటీవల ఇన్‌సోమ్నియాతో ఇబ్బందిపడ్డారు. వైద్యుల సూచనతో మాత్రలు వాడుతున్నారు. అయితే మాత్రలు ఒకింత ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

అంతే తప్ప ఆమె ఆత్మహత్యాయత్నం చేయలేదు. దయచేసి తప్పుడు కథనాలు ప్రచారం చేయవద్దు. మా కుటుంబమంతా కలిసి సంతోషంగా ఉన్నామన్నారు. మా తల్లిదండ్రులు ఆనందంగా జీవిస్తున్నారని, త్వరలోనే తల్లి ఇంటికి తిరిగి వస్తారని దయ మీడియాతో చెప్పారు.

హైదరాబాద్ కేపీహెచ్బీలోని ఓ విల్లాలో ఉ...