Hyderabad, ఫిబ్రవరి 6 -- Producer Singanamala Ramesh Babu About His Case: టాలీవుడ్‌లో గతంలో టాప్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు నిర్మాత సింగగనమల రమేష్ బాబు. 14 ఏళ్ల నాటి కేసులో ఆయనను నాంపల్లి కోర్టు నిర్దోషిగా తీర్పు ఇచ్చింది. దానికి సంబంధించిన విషయాలని తాజాగా మీడియా సమావేశంలో తెలిపారు.

''నేనొక ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌ని. సినిమా అంటే పాషన్‌తో నిర్మాతగా మారాను. సినిమా నాకు తల్లి లాంటిది. మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి.. ఇలా పలువురు వ్యక్తులకు అమ్మానని నాపై కేసు పెట్టారు. 14 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశాను. అది తప్పుడు కేసని తేలింది. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది. తప్పుడు కేసులు కోర్టు ముందు నిలబడవు. నా న్యాయపోరాటం గెలిచింది" అని నిర్మాత సింగనమల రమేష్ బాబు అన్నారు.

-నాకు ఎలాంటి కక్ష సాధింపులు లేవ...