Hyderabad, మార్చి 26 -- ఐస్ క్రీమ్ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా వేసవిలో కచ్చితంగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. కానీ అది చేయడం కష్టమని తల్లులు వెనకడుగు వేస్తూ ఉంటారు. కేవలం పాలు, పంచదార, కస్టర్డ్ పౌడర్ తో మీరు టేస్టీగా ఐస్ క్రీమ్ చేసేయొచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. పైగా మెత్తగా వస్తుంది. పసుపు రంగులో కనిపిస్తుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. దీన్ని చేయడం ఎలాగో తెలుసుకోండి.

కస్టర్డ్ పౌడర్ - పావు కప్పు

పాలు - ఒకటిన్నర కప్పు

వెనిల్లా ఎసెన్స్ - ఒక స్పూను

పంచదార - ఒక కప్పు

ఫ్రెష్ క్రీమ్ - ఒక కప్పు

1. ఈ ఐస్‌‌క్రీమ్ తయారు చేయడం చాలా సులువు.

2. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక పావుగంట సమయాన్ని కేటాయించడమే.

3. స్టవ్ మీద కళాయి పెట్టి పాలు వేసి మరిగించండి.

4. పాలు మరిగాక అందులో పంచదారను వేసి అది కరిగే వరకు బాగా కలుపుకోండి.

5. తర్వాత కస్టర్...