భారతదేశం, జనవరి 30 -- Simhachalam Lands: ఎంతో కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న సింహాచలం పంచ గ్రామాల సమస్యకు త్వరలో ప్రభుత్వం పరిష్కారం చూపనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెవిన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో సచివాలయంలో జరిగిన సమావేశంలో పంచగ్రామాల సమస్యకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

పంచగ్రామాల్లో సింహాచలం భూముల్లో ఉన్న 12,149 ఇళ్లను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం అమోదం తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నయంగా దాదాపు రూ.5,300 కోట్ల విలువ చేసే 610 ఎకరాల ప్రభుత్వ భూమిని సింహాచల దేవస్థానానికి ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసినట్టు రెవిన్యూ మంత్రి తెలిపారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సింహచల దేవ స్థానం అనువంశిక ధర్మకర్...