Hyderabad, ఫిబ్రవరి 18 -- పండుగైనా, ఏదైనా ప్రత్యేక రోజులైనా షుగర్‌తో చేసిన తీపి వంటకం కచ్చితంగా ఉండాల్సిందే. ఆరోగ్య సమస్యలను పక్కకుపెట్టి రుచి కోసం షుగర్ ను కచ్చితంగా వాడేసే వాళ్లు ఇది తప్పక తెలుసుకోవాలి. పండ్లు, కూరగాయల్లో దొరికే షుగర్ శక్తిని అందిస్తే, చక్కెర కలుపుకుని తినే ఆహార పదార్థాల వల్ల అనారోగ్యం కలిగే ప్రమాదముందట. మరి, రోజువారీ లైఫ్ లో మీరు తినే చక్కెర లిమిట్ లోనే ఉంటుందా.. హద్దు దాటుతుందా అని ఇలా తెలుసుకోండి.

మీరు షుగర్ ఎక్కువగా తింటుంటే, తరచూ నీరస పడిపోతుండటం సంభవించవచ్చు. మీరు షుగర్ తినగానే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. వాటి ద్వారా మీకు తక్షణమే శక్తి అందుతుంది. తాత్కాలికంగా శక్తిని అందించినప్పటికీ కాసేపటికే నీరసం కలుగుతున్నట్లు అనిపిస్తుంది.

మీకు తరచుగా స్వీట్స్ తినాలనిపిస్తుందంటే, కాస్త ఆలోచించాల్సిన విషయమే. ...