భారతదేశం, ఫిబ్రవరి 3 -- స్టార్ బాయ్, యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన 'కృష్ణ అండ్ హిస్ లీల' చిత్రానికి మంచి ప్రశంసలు వచ్చాయి. 2020లో ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకే అడుగుపెట్టింది. కరోనా పరిస్థితులతో ఓటీటీ బాటపట్టింది. ఈ చిత్రానికి సిద్ధునే కథ అందించటంతో పాటు ఎడిటింగ్ కూడా చేశారు. ఈ రొమాంటిక్ డ్రామా మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సిద్ధుకు స్టార్ డమ్ వచ్చాక ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చింది. అయితే, సుమారు ఐదేళ్లకు కృష్ణ అండ్ హిస్ లీల చిత్రం మరో పేరుతో థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది.

కృష్ణ అండ్ హిస్ లీల చిత్రం 'ఇట్స్ కాంప్లికేటెడ్' అనే పేరుతో థియేటర్లలో రిలీజ్ కానుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ అనౌన్స్‌మెంట్ కోసం మూవీ టీమ్ ఓ వీడియో రిలీజ్ చేసింది. సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ రవ...