భారతదేశం, ఫిబ్రవరి 23 -- Siddipet Tragedy : వాళ్లిద్దరికి ఏమి కష్టం వచ్చిందో ఏమో, ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్నారు. అందులో ఒకరు అక్కడిక్కడికే చనిపోగా, మరొకరు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గంటల వ్యవధిలోనే మరణించారు. సిద్దిపేట పట్టణంలోని సాయి విద్యానగర్ కు చెందిన శిరోద్కర్ లక్ష్మి (57) , రంగారెడ్డి జిల్లా , ఘట్కేసర్ ఆదర్శనగర్ కు చెందిన టింగ్లేకర్ శ్రీధర్ (46) శనివారం అర్ధరాత్రి తిమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులోని హైవే హోటళ్ల సమీపంలో రోడ్డు పక్కన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... ఇద్దరు వ్యక్తులు మంటల్లో కాలిపోతున్నట్లు గమనించిన స్థానికులు మంటలు ఆర్పి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. లక్ష్మీ సంఘటన స్థలంలోని మృతిచెందగా, 80 శాతం కాలిన గాయాలతో...