భారతదేశం, ఫిబ్రవరి 21 -- Siddipet Murder : హోమో సె* చేయటాన్ని ప్రతిఘటించాడని, తన స్నేహితున్నే కొట్టి చంపాడు ఒక వ్యక్తి. సిద్దిపేట పట్టణంలో ఫిబ్రవరి 19 రోజున జరిగిన ఒక హత్య కేసు దర్యాప్తులో సిద్దిపేట టూ టౌన్ పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. వివరాల్లోకి వెళితే, పట్టణంలోని కేసీఆర్ నగర్ లో బోదాసు శ్రీనివాస్ (32) తన భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కరీంనగర్ జిల్లా రేగుర్తిలోని బుడగ జంగాల కాలనీకి చెందిన పర్వతం రాజు (40) తో స్నేహంగా మెలిగేవాడు. రాజు భార్య అతడిని వదిలేయడంతో, ఒక్కడే గత కొంత కాలంగా సిద్దిపేట పట్టణంలో ఉంటూ, వేరు వేరు పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు.

గత బుధవారం రోజు, శ్రీనివాస్ ను మందు తాగుదామని రాజు తీసుకెళ్లాడు. అయితే తన భర్త ఎంతకూ తిరిగి ఇంటికి రాకపోవటం, ఫోన్ కూడా లిఫ్ట్ చేయటపోవడంతో...శ్రీనివాస్ భార్య రెండో పట్టణ పోల...