భారతదేశం, ఫిబ్రవరి 11 -- Siddipet Crime: ఆస్తి కోసం సొంత అక్క, బావలే కిరాతకంగా హత్యకు పాల్పడిన ఘటన సిద్ధిపేటలో వెలుగు చూసింది. ఆకునూరు గ్రామానికి చెందిన దొండకాయల కనకయ్యకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక అక్క ఉన్నారు. తల్లిని సరిగా చూడడం లేదని కనకయ్య అక్క అబ్బు యాదవ్వ (58) తల్లి బాగోగులు చూసుకుంటూ తల్లి పేరున ఉన్న భూమిని తన సోదరులకు తెలియకుండా 3 ఎకరాల 03 గుంటల భూమి తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నది.

ఈ విషయం తెలిసిన తమ్ముళ్లు తమకు వేరే జీవనధారం లేక భూమిని తిరిగి ఇవ్వమని అడిగినా కూడా పట్టించుకోకుండా ఆ భూమిని యాదవ్వ తన భర్త లింగంతో కలిసి మరొకరికి అమ్మేసింది. భూమి కొన్నవారు అందులో రాళ్లు పాతుకోవడానికి వెళ్లినపుడు యాదవ్వ తమ్ముళ్లు వారిని అడ్డుకోవడంతో పెద్ద తమ్ముడైన కనకయ్య పై అక్కా, బావలు కక్ష పెంచుకున్నారు.

ఫిబ్రవరి 6 సాయంత్రం మర్పడగ గ్రామంలో ఉన్న అక్క...