భారతదేశం, ఫిబ్రవరి 21 -- Siddipet Boy: కిలిమంజారో పర్వతాన్ని అవలీలగా ఎక్కిన సిద్దపేట బాలుడు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం హనుమ తండా కి చెందిన జాటోత్ విహాన్ రామ్ వయసు 9 సంవత్సరాలు.

కఠిన సాధన తో ఆఫ్రికా ఖండం లోని టాంజానియా దేశం లో గల కిలిమంజారో పర్వతాన్ని (5,685 మీటర్లు) మరియు హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి లో గల పాతాల్సు పర్వతాన్ని (4,250 మీటర్లు) అధిరోహించి తెలంగాణ రాష్ట్రం లోనే అతి చిన్న వయస్సు లో పర్వతాలను ఎక్కిన రికార్డ్ విహాన్ రామ్ సొంతం చేసుకున్నాడు.

పర్వతారోహణకు బాలుడి తండ్రితో పాటు గురువు మహిపాల్ రెడ్డి ని కూడా తీసుకెళ్తారు. అంత పెద్ద శిఖరాలను అధిరోహించాలంటే శారీరకంగా బలంగా ఉండాలి కాబట్టి బాలుడు రోజు ఉదయాన్నే నిద్ర లేచి యోగ,రన్నింగ్, సైక్లింగ్ చేస్తానని జంక్ ఫుడ్ తినడం మానేశానని చెబుతున్నాడు.

బాలుడ...