భారతదేశం, జనవరి 30 -- Siddipet Accident: సిద్దిపేట జిల్లా అక్కన్న పేట మండలంలో ఉపాధి హామీ పనుల్లో ప్రమాదం జరిగి తల్లీ కూతుళ్లు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

గ్రామస్తులు, అధికారుల కథనం ప్రకారం, గ్రామంలోని ఉపాధి హామీ కార్మికులు గత కొన్నిరోజులుగా ఊరి చివరలో ఉన్న గుట్ట వద్ద మట్టి ఎత్తే పనులు చేస్తున్నారు. యధావిధిగా, ఈ రోజు కూడా కూలీలు పనికి వెళ్లారు. గుట్ట మీద కొన్ని భారీ బండ రాళ్ళూ ఉండటం, కూలీలు చుట్టూ ఉన్న మట్టి తొలగించడంతో, ఆ బండరాళ్లు కింద పనిచేస్తున్న కూలీల పైనా దొర్లి పడ్డాయి.

గ్రామానికి చెందిన మహిళా కందారపు సరోజన (51), అదే గ్రామంలో నివసిస్తున్న తన కూతురు అన్నారి మమతా (32) అక్కడిక్కడే మృతి ...