భారతదేశం, మార్చి 14 -- సిద్దిపేట జిల్లాకు చెందిన ఈ మాస్టారు పేరు బాల్ రెడ్డి. వయస్సు దాదాపు 80 ఏళ్లు ఉంటాయి. 1970లో బాల్ రెడ్డి ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌గా, ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 2005 వరకు పనిచేసి రిటైర్ అయ్యారు. 35 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పేద విద్యార్థులకు పాఠాలు చెప్పిన బాల్ రెడ్డి.. రిటైర్ అయ్యాక కూడా విశ్రాంతి తీసుకోవడం లేదు.

రిటైర్ అయ్యాక కూడా ఇంకా విద్యార్థులకు పాఠాలు చెప్తూనే ఉన్నారు. 2005 నుంచి సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ప్రజ్ఞాపూర్, తిమ్మక్కపల్లి, క్యాసారం, దాచారం గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పైసా ఆశించకుండా పాఠాలు చెప్పారు. పైగా తన స్వగ్రామం తిగుల్ నుంచి ప్రతిరోజూ 15 కిలోమీటర్లు తన సొంత డబ్బులతో ఆటోలో ఆయా గ్రామాలకు వెళ్లి పిల్లలకు చదువు చెప్పారు.

ఇలా ...