Hyderabad, ఏప్రిల్ 10 -- Siddhu Jonnalagadda Comments In Jack Movie Pre Release Event: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించిన సినిమా 'జాక్ - కొంచెం క్రాక్'. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మించింది.

జాక్ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. జాక్ మూవీ ఇవాళ (ఏప్రిల్ 10) ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే పలు చోట్ల జాక్ మూవీ ప్రీమియర్ షోలు పడగా సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది. అయితే, విడుదలకు ముందు జరిగిన జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. "జాక్ ఈవెంట్‌కు వచ్చిన చందూ మొండేటి, కార్తీక్, కల్యాణ్ శం...