Hyderabad, మే 19 -- Siddharth 40 Bilingual Movie: సక్సెస్ ఫుల్ పాన్-ఇండియన్ యాక్టర్ సిద్ధార్థ్ చిత్ర పరిశ్రమలో 21 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రతి పరిశ్రమలో శాశ్వత ప్రభావాన్ని చూపారు. అతను ఎంచుకునే కథలు, పాత్రల, అసాధారణమైన పెర్ఫార్మెన్స్‌తో అద్భుతంగా అలరిస్తున్నాయి. బాలీవుడ్‌లో 'రంగ్ దే బసంతి'తో చెరగని ముద్ర వేశారు.

తెలుగులో 'బొమ్మరిల్లు' సినిమాతో ప్రేక్షకుల మన్ననలు పొందారు సిద్ధార్థ్. తమిళ పరిశ్రమలో పలు జోనర్‌లలో మెరిసి.. సినిమా, నటనపై తనకున్న గొప్ప అభిరుచిని చూపించారు సిద్ధార్థ్. ఆయన రీసెంట్ మూవీ 'చిత' ప్రేక్షకుల హృదయాల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇప్పుడు 'సిద్ధార్థ్ 40'( వర్కింగ్ టైటిల్) పేరుతో మరో ఎగ్జయిటింగ్ మూవీ కోసం కోసం మంచి యూనిట్‌తో చేతులు కలిపారు.

ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌ను '8 తొట్టక్కల్'...