Hyderabad, జనవరి 28 -- Siddharth: తమిళంతోపాటు తెలుగు సినిమాల్లోనూ నటించి పేరు సంపాదించిన నటుడు సిద్ధార్థ్ ఈ మధ్యే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన సినిమాలు, తాను చదవిని పుస్తకాల గురించి అతడు చెప్పుకొచ్చాడు. ఈ ఈవెంట్లో తన భార్య అదితి రావ్ హైదరీ తల్లి విద్యా రావుతో అతడు మాట్లాడటం విశేషం. సినిమాల్లో తాను అమ్మాయిలను వేధించే బ్యాడ్ బాయ్ పాత్రలను ఎలా తిరస్కరించానో చెప్పాడు.

హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో నటుడు సిద్ధార్థ్ ఆడియెన్స్ తోనూ ముచ్చటించాడు. ఈ సందర్భంగా వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. తాను కొన్ని సినిమాలకు ఓకే చెప్పి ఉంటే మరింత పెద్ద స్టార్ అయి ఉండేవాడినని గుర్తు చేసుకున్నాడు.

"అమ్మాయిల నడుములు గిల్లడం, వాళ్లను కొట్టడం, ఐటెమ్ సాంగ్స్ చేయడం, అమ్మాయిలు ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్లాలో చెప్పడంలాంటి స్క్రిప్ట్ ల...