Hyderabad, ఏప్రిల్ 10 -- తోబుట్టువులు ఈ ప్రపంచంలో మొదటి స్నేహితులు. ఒకే కుటుంబంలో పెరిగిన తోబుట్టువులు కష్టసుఖాలను పంచుకునిపెరుగుతారు. వారి మధ్య ఎలాంటి రహస్యాలు ఉండవు. ఆనందాన్ని షేర్ చేసుకుని ఓటమి సమయంలో ఒకరికొకరు ఓదార్పుగా ఉంటారు. తల్లిదండ్రుల తరువాత ఒక వ్యక్తికి బాగా దగ్గరయ్యే వ్యక్తులు తోబుట్టువులే.

అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. మళ్లీ కలిసి ఆడుకుంటారు. కలిసి ప్రతి పనిని పూర్తి చేస్తారు. అమ్మానాన్నలకు అండగా నిలుస్తారు. పెద్దయ్యాక తోబుట్టువులతో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలను మరచిపోవడం చాలా కష్టం. తోబుట్టువులు హద్దుల్లేని ప్రేమ బంధాలను పంచుకుంటారు. చివరి వరకు ఒకరికొకరు అండగా ఉంటామనే వాగ్దానం చేస్తారు.

మన రహస్యాలను దాచుకోవడం దగ్గర్నుంచి మన మనసులో ఏముందో చెప్పేదే తోబుట్టువులే. వారితో పంచుకునే ప్రత్యేక బంధాన్ని సెలెబ...