భారతదేశం, ఏప్రిల్ 8 -- ఛాంపియన్స్ ట్రోఫీలో భారత విక్టరీలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు దుబాయ్ లో నెట్స్ లో ఏడ్చినట్లు వెల్లడించాడు. కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పాడు. దుబాయ్ లోని కండీషన్లు అలవాటు పడటంలో ఇబ్బందులు ఎదురవడంతో అతను ఏడుపు ఆపుకోలేకపోయాడు. ఈ విషయాన్ని క్యాండిడ్ విత్ కింగ్స్ ఎపిసోడ్ లో బయటపెట్టాడు.

క్యాండిడ్ విత్ కింగ్స్ ఎపిసోడ్ లో మాట్లాడుతూ, చివరిగా ఎప్పుడు ఏడ్చారని అడిగిన ప్రశ్నకు శ్రేయస్ అయ్యర్ సమాధానం ఇచ్చాడు. "చివరిగా నేను ఏడ్చింది ఛాంపియన్స్ ట్రోఫీలో. మొదటి ప్రాక్టీస్ సెషన్ లో నిజంగానే ఏడ్చాను. నేను నెట్స్ లో బ్యాటింగ్ చేశాను. కానీ అది వర్కౌట్ కాలేదు. నెట్స్ లో బంతిని కనెక్ట్ చేయలేకపోయా. నా మీద నాకు చాలా కోపం వచ్చింది. నేను ఏడ్వడం మొదలుపెట్టాను. నేనెప్పుడు అం...